AP News: ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే ధైర్యముందా?: అచ్చెన్న

పరిషత్‌ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని వైకాపా ఖూనీ చేసిందని తెదేపా ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Updated : 19 Sep 2021 15:52 IST

అమరావతి: పరిషత్‌ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని వైకాపా ఖూనీ చేసిందని తెదేపా ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైకాపా తీరు వల్లే పరిషత్‌ ఎన్నికలను తెదేపా బహిష్కరించిందని చెప్పారు. అధికార పార్టీకి అధికారులు, పోలీసులు సహకరించారని.. ఈ ఎన్నికలు ప్రజాభిప్రాయం కాదన్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే ధైర్యం జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చట్టాల ఉల్లంఘన, రాజ్యాంగ ధిక్కరణ జరుగుతోందని అచ్చెన్న విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని వైకాపా ఎలా అపహాస్యం చేసిందో దేశం మొత్తం చూసిందన్నారు. మెజారిటీ స్థానాల్లో ఏకగ్రీవం కోసం అక్రమ కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని