Atchennaidu: ఏపీలో మూడు రకాల ట్యాక్స్‌ల దందా: అచ్చెన్నాయుడు

ఏపీలో జేఎంఎం పేరిట మూడు రకాల ట్యాక్స్‌ల దందా నడుస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్రస్థాయిలో జె ట్యాక్స్‌.. జిల్లా స్థాయిలో

Published : 06 Sep 2021 14:59 IST

అమరావతి: ఏపీలో జేఎంఎం పేరిట మూడు రకాల ట్యాక్స్‌ల దందా నడుస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్రస్థాయిలో జె ట్యాక్స్‌.. జిల్లా స్థాయిలో మంత్రి ట్యాక్స్‌.. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే ట్యాక్స్‌ అమలవుతోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘‘ఏ పని ప్రారంభించాలన్నా కొబ్బరికాయ కొట్టే ముందు జె ట్యాక్స్‌ కట్టాల్సి వస్తోందనడానికి వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు జయరామిరెడ్డి బరితెగింపులే నిదర్శనం. రాయదుర్గంలో జయరామిరెడ్డి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా. పనులు చేస్తున్నవారిని బెదిరించడం సిగ్గుచేటు. వైకాపా నేతల తీరుతో రాష్ట్రంలో పనులు చేసేందుకు ఏ కాంట్రాక్టరూ ముందుకు రావడం లేదు. మద్యం, ఇసుక, మైనింగ్‌, జూదం ద్వారా సంపాదిస్తోంది సరిపోక కాంట్రాక్టర్లపైనా పడ్డారు. గత రెండేళ్లలో ఎంతో మంది కాంట్రాక్టర్లను ముడుపుల కోసం బెదిరించి తరిమేశారు’’ అని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని