AP News: రూ.5వేల కోట్లు దండుకునేందుకు పేదలను మభ్యపెడుతున్నారు: అచ్చెన్నాయుడు

తన పుట్టిన రోజు నాడు పేదల రక్తం పీల్చే ఇళ్ల పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని

Updated : 21 Dec 2021 18:45 IST

అమరావతి: తన పుట్టిన రోజు నాడు పేదల రక్తం పీల్చే ఇళ్ల పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పేదలపై భారం మోపుతూ సిగ్గులేకుండా చంద్రబాబు, మీడియా అధినేతలపై అసందర్భ ప్రేలాపనలు చేశారని మండిపడ్డారు.  ఓటీఎస్‌పై జగన్‌కు అసలేం హక్కుందని ప్రశ్నించారు. జగన్‌ ఫొటోతో రూపొందించిన పత్రాన్ని రిజిస్ట్రేషన్‌గా చెప్పుకుంటున్నారని విమర్శించారు. పేదల వద్ద రూ.5వేల కోట్లు దండుకునేందుకు చిత్తు కాగితాల్ని రిజిస్ట్రేషన్‌ పత్రాలుగా చూపుతూ మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతనైతే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయాలని సూచించారు. అమ్మకం అనే పదం తప్ప ముఖ్యమంత్రి నోటివెంట మరో మాట రావట్లేదన్నారు. 50ఏళ్లుగా ఇంటి హక్కు దారులుగా ఉన్నవారికి జగన్‌ అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నానని చెప్పటం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఐదేళ్లలో 32లక్షల ఇళ్లు కడతామని చెప్పిన జగన్‌.. 30 నెలల్లో ఒక్క ఇల్లైనా కట్టారా? అని నిలదీశారు.పేదల ఇళ్లకు 3.10 కోట్ల మెట్రిక్‌ టన్నుల ఇసుక అవసరమన్న అచ్చెన్నాయుడు ఇప్పటి వరకు కేవలం 5.43లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక మాత్రమే ఉపయోగించారని వెల్లడించారు. 32లక్షల ఇళ్లు ఎప్పుడు కడతారని ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని