Avanti srinivas: ఆ ఆడియోక్లిప్‌ చూసి కలత చెందా: అవంతి

సామాజిక మాధ్యమాల్లో తనపై వచ్చిన ఆడియో క్లిప్‌లు చూసి కలత చెందానని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ వెల్లడించారు.

Updated : 20 Aug 2021 18:56 IST

విశాఖపట్నం: సామాజిక మాధ్యమాల్లో తనపై వచ్చిన ఆడియో క్లిప్‌లు చూసి కలత చెందానని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ వెల్లడించారు. గురువారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘‘ నాపై సోషల్‌ మీడియాలో పెట్టిన ఆడియో క్లిప్‌లపై విశాఖ సీపీకి ఫిర్యాదు చేశా. తాత్కాలిక ఆనందం కోసం కొందరు ఇలాంటివి చేస్తున్నారు. వైకాపాకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే కల్పితాలు ప్రచారం చేస్తున్నారు’’ అని అవంతి శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని