
Badvel By Election:: బద్వేలు ఉప ఎన్నిక భాజపా అభ్యర్థి ఖరారు
బద్వేలు: కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక భాజపా అభ్యర్థి ఖరారయ్యారు. తమ పార్టీ తరఫున పనతల సురేష్ పోటీ చేయనున్నట్లు ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. సురేష్‌ను అదిష్ఠానం ఎంపిక చేసినట్లు ఆయన ఓ ప్రకటనలో చెప్పారు. దివంగత ఎమ్మెల్యే డా.వెంకటసుబ్బయ్య ఆకస్మిక మరణంతో బద్వేలు ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార పార్టీ తరఫున వెంకటసుబ్బయ్య భార్య సుధ బరిలో ఉన్నారు. ఇక్కడ ఈ నెల 30న పోలింగ్, వచ్చే నెల 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. తెదేపా, జనసేన ఉప ఎన్నికకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.