
Updated : 28 Sep 2021 13:07 IST
AP News: బద్వేలు ఉప ఎన్నిక.. వైకాపా, తెదేపా అభ్యర్థులు వీరే.?
బద్వేలు: కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో అక్కడ అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య సుధ పేరును వైకాపా అధిష్ఠానం దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. మరోవైపు తెదేపా అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్ పేరును ఆ పార్టీ ఇప్పటికే ఖరారు చేసింది. బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న వైకాపా ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చిలో కన్నుమూశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ శాసనసభ స్థానానికి అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Tags :