Ts politics: రాష్ట్రానికి న్యాయం చేసే ఉద్దేశం కేసీఆర్‌కు ఉందా?: బండి సంజయ్‌

తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేసే ఉద్దేశం సీఎం కేసీఆర్‌కు ఉందా? నదీ యాజమాన్య బోర్డుల భేటీకి ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ) ఎందుకు హాజరు కాలేదని భాజపా

Published : 12 Aug 2021 01:22 IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేసే ఉద్దేశం సీఎం కేసీఆర్‌కు ఉందా? నదీ యాజమాన్య బోర్డుల భేటీకి ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ) ఎందుకు హాజరు కాలేదని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. దీని ద్వారా ఏపీ అక్రమ ప్రాజెక్టులపై నిలదీసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందన్నారు. బోర్డుల సమావేశాలకు హాజరైతేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కృష్ణాలో 555 టీఎంసీలు రాష్ట్రానికి రావాల్సి ఉండగా కేవలం 299 టీఎంసీలకే ఒప్పుకున్నారని మండిపడ్డారు. ఉన్న 299 టీఎంసీలనూ రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవట్లేదని.. ఏపీ ప్రభుత్వం 150 టీఎంసీలు అదనంగా వినియోగించుకుంటుందన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా హాలియాలో నిర్వహించిన సభలో.. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్‌ మాటిచ్చారని బండి సంజయ్‌ గుర్తు చేశారు. ఎన్నికలు వస్తేనే కేసీఆర్‌కు పోడు రైతులు, వారి సమస్యలు గుర్తుకు వస్తాయా? అని ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని