Bandi Sanjay: ఆ జీవోను సవరించే వరకు బదిలీలు ఆపాలి: బండి సంజయ్‌

తెలంగాణ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు.

Updated : 31 Dec 2021 14:16 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. జీవో 317ను సవరించాలని కోరుతూ గవర్నర్‌కు భాజపా నేతలు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో సంజయ్‌ మాట్లాడారు. హడావుడిగా విడుదల చేసిన జీవోను సవరించాలని గవర్నర్‌ను కోరామన్నారు. ఉద్యోగుల ఇబ్బందుల గురించి తెలుసుకునే సమయం కూడా ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. ఉద్యోగుల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. దీనివల్ల వారు ఎంతో మానసిక ఆవేదనకు గురవుతున్నారని చెప్పారు. 

స్పౌజ్‌, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు, దివ్యాంగులైన ఉద్యోగుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవడం లేదని బండి సంజయ్‌ ఆక్షేపించారు. ఉద్యోగుల వల్లే కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారని.. ఈ విషయంలో సీఎం మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. జీవోను సవరించే వరకు బదిలీల ప్రక్రియను ఆపాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులెవరూ నిరాశ చెందొద్దని.. వారికి భాజపా అండగా ఉంటుందన్నారు. కేసీఆర్‌ వైఖరిలో మార్పు వచ్చేవరకు సకల జనుల సమ్మె తరహాలో ఆందోళన చేద్దామని పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఆందోళనపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని