
TS News: మాపై దాడులకు కేసీఆరే సూత్రధారి: బండి సంజయ్
సూర్యాపేట: ‘మాపై తెరాస దాడులకు సీఎం కేసీఆర్ సూత్రధారి’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. వానాకాలం పంట కొనాలని కోరితే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. సంజయ్ పర్యటన సందర్భంగా నిన్న నల్గొండ, మిర్యాలగూడలలో తెరాస, భాజపా కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. బండి సంజయ్ కాన్వాయ్‌పైనా దాడి జరిగిన నేపథ్యంలో ఆయన సూర్యాపేటలో మీడియా సమావేశం నిర్వహించారు. ‘సీఎం కేసీఆర్ బయటకు రారు.. ప్రగతిభవన్‌కే పరిమితమయ్యారు. సమస్యలు పరిష్కరించాల్సిన వారే ధర్నాలు చేస్తున్నారు. తెరాస దాడుల్లో 8వాహనాలు ధ్వంసమయ్యాయి.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. మా పర్యటన షెడ్యూల్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. భాజపాను అడ్డుకునేందుకు తెరాస యత్నిస్తుందని తెలిసినా చర్యలు తీసుకోలేదు. సీఎం కేసీఆరే శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నారు. వానాకాలం పంటను కొనుగోలు చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 40లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటామని ఒప్పందం జరిగింది’’ అని బండి సంజయ్ అన్నారు.
సంజయ్‌కు అమిత్‌షా ఫోన్..
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నల్గొండ జిల్లా పర్యటనలో నిన్న ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్ బండి సంజయ్‌కు ఫోన్ చేశారు. దాడికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
-
Technology News
WhatsApp: మహిళల కోసం వాట్సాప్‌లో కొత్త సదుపాయం
-
Sports News
Pakistan: ఒకరు విజయవంతమైతే.. మా సీనియర్లు తట్టుకోలేరు: పాక్ క్రికెటర్
-
Movies News
Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
-
World News
Ukraine Crisis: జీ-7 సదస్సు వేళ.. కీవ్‌పై విరుచుకుపడిన రష్యా!
-
General News
Health: వృద్ధాప్యం వస్తే ఏం తినాలో తెలుసా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Chiranjeevi: నాకూ గోపీచంద్‌కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
- Bypolls: యూపీలో భాజపాకు బిగ్ బూస్ట్.. పంజాబ్‌లో ఆప్‌కు భంగపాటు
- E Passport: ఈ పాస్‌పోర్ట్‌లు వస్తున్నాయ్.. ఎప్పటి నుంచి జారీ చేస్తారు?ఎలా పనిచేస్తాయి?
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- PCOD: అధిక బరువుకు బై బై చెప్పేద్దామా.. పరిష్కార మార్గాలివిగో..!
- Droupadi Murmu: ఎట్టకేలకు మోక్షం.. ద్రౌపదీ ముర్ము స్వగ్రామానికి కరెంటు..!
- Matoshree: మాతోశ్రీకి ఎందుకు తిరిగి వచ్చారంటే?
- అక్కడి మహిళలు ఆ ఒక్క రోజే స్నానం చేస్తారట!
- Ukraine Crisis: యుద్ధ భూమిలో వివాహ వేడుకలు.. ఒక్కటవుతున్న వేలాది జంటలు