Updated : 18 Dec 2021 13:59 IST

TS News: ఎన్నికలొస్తేనే నోటిఫికేషన్లంటూ ఊదరగొడతారు: బండి సంజయ్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘20 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్‌పీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా ఏం చేయాలి. డిగ్రీలు, పీజీలు చదివి ఎంతో మంది ఖాళీగా ఉంటున్నారు. ఎన్నికలు వస్తేనే నోటిఫికేషన్లు అంటూ ఊదరగొడతారు. సీఎం కేసీఆర్‌ లాకర్లలో కొన్ని విషయాలు పెట్టుకుంటారు. పాత సమస్యలపై ఆందోళన చేస్తే కొత్త సమస్యను తెరపైకి తెస్తారు’’ అని బండి సంజయ్‌ విమర్శించారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని