
Updated : 28 Aug 2021 11:59 IST
TS Politics: భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో బండి సంజయ్ పూజలు
హైదరాబాద్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన అక్కడి నుంచి అమ్మవారి దేవాలయానికి వెళ్లారు. చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన అనంతరం పాదయాత్ర ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర ఇంచార్జి తరుణ్‌ఛుగ్, ముఖ్యనేతలు డీకే అరుణ, విజయశాంతి, అరుణ్‌సింగ్, లక్ష్మణ్, మురళీధర్‌రావు, సత్యకుమార్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలి రోజు పాదయాత్ర అఫ్జల్‌గంజ్, నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం, లక్డీకాపూల్ మీదుగా మెహిదీపట్నం వరకు సాగుతుంది. మెహిదీపట్నం పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాలలో ఈ రోజు రాత్రి బస చేయనున్నారు.
Tags :