TS News: మానకొండూర్‌ నుంచి కరీంనగర్‌కు బండి సంజయ్‌ తరలింపు

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317జీవోకు నిరసనగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్‌లో

Updated : 03 Jan 2022 08:11 IST

కరీంనగర్‌: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317జీవోకు నిరసనగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్‌లో చేపట్టిన దీక్షను నిన్న రాత్రి భగ్నం చేసిన పోలీసులు ఆయన్ను మానకొండూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి బండి సంజయ్‌ను ఈ ఉదయం కరీంనగర్‌లోని పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు తరలించారు. వరంగల్ రేంజ్‌ ఐజీ నాగిరెడ్డి వాహనంలో సంజయ్‌ను కరీంనగర్‌కు తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల కోసం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్‌ చేస్తూ భాజపా చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది.ఆదివారం రాత్రి కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయం వద్ద వేదికను ఏర్పాటు చేసి బండి సంజయ్‌ ఆధ్వర్యంలో చేపట్టాలనుకున్న ఈ దీక్షకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఎలాగోలా కార్యాలయంలోకి చేరుకున్న సంజయ్‌ గేటుకు తాళం వేసుకొని దీక్ష ప్రారంభించారు. రాత్రి 10.30 గంటలకు పోలీసులు తలుపులు పగలగొట్టి ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని