
Published : 19 Oct 2021 01:46 IST
Ts News: ‘దళితబంధు’ నిలిపివేత.. కేసీఆర్ వైఫల్యమే కారణం: బండి సంజయ్
హైదరాబాద్: రాష్ట్రంలోని దళితులను మరోసారి మోసం చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం నిలిపివేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యమే కారణమన్నారు. ఈ పథకం అమలును నిలిపివేసేలా కేంద్ర ఎన్నికల సంఘానికి అవకాశం కల్పించేలా కేసీఆర్ వ్యవహరించారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఈ పథకాన్ని నిలిపివేస్తోందని తెలిసే ఇవాళ సమావేశం నిర్వహించి దళితబంధుపై చిలుక పలుకులు పలికారని పేర్కొన్నారు. కొనసాగుతున్న పథకాలను ఎన్నికల కమిషన్ ఎప్పుడూ నిలిపివేయదని బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి
Tags :