
Bandi sanjay: గడీల పాలనను భాజపా అంతం చేస్తుంది: బండి సంజయ్
హుస్నాబాద్: గడీల పాలనను భాజపా అంతం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బండి సంజయ్ చేపట్టిన తొలివిడత ప్రజా సంగ్రామయాత్ర హుస్నాబాద్‌లో ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... ప్రజా సంగ్రామయాత్ర ఇకపై కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రంలో అమలయ్యే ప్రతి పథకానికి కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. కానీ, ఈ ప్రభుత్వం అన్ని కులవృత్తులను దెబ్బతీసింది. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ విజయాన్ని తెరాస అడ్డుకోలేదు. నేను హిందూత్వం గురించి మాట్లాడితే తప్పా? రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందే. 80 శాతం ఉన్న హిందువుల గురించి మాట్లాడవద్దా? భాజపా, బండి సంజయ్ హిందూ ధర్మం కోసమే పోరాడుతుంది. రామరాజ్యం కావాలో, తాలిబన్ల రాజ్యం కావాలో తేల్చుకోవాలి’’ అని బండి సంజయ్ అన్నారు. ముగింపు సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, భాజపా నేతలు లక్ష్మణ్, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. సభకు భాజపా శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.