Punjab polls: భాజపా, అమరీందర్ పొత్తు ఖరారు..

కొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీలు పొత్తులతో తమ బలాన్ని పెంచుకుంటున్నాయి. 

Published : 28 Dec 2021 01:14 IST

చండీగఢ్‌: కొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీలు పొత్తులతో తమ బలాన్ని పెంచుకునేందుకు యత్నిస్తున్నాయి. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపాకు తాజాగా రెండు పార్టీలు కూటమిగా కలిశాయి. ఒకటి.. అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్‌ కాంగ్రెస్‌, ఇంకోటి.. సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్‌( సంయుక్త్‌). ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని కేంద్రమంత్రి, పంజాబ్‌ ఎన్నికల ఇంఛార్జి గజేంద్ర సింగ్ షెకావత్ సోమవారం వెల్లడించారు. 

ఈ రోజు దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్‌ షాతో అమరీందర్ సింగ్, ధిండ్సా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసిపోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు షెకావత్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలతో కొద్ది నెలల క్రితం అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీని వీడి కొత్త పార్టీని స్థాపించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని