AP News: అన్నపూర్ణాంధ్రను అప్పులమయం చేశారు: సోము వీర్రాజు

అన్నపూర్ణాంధ్రను అప్పుల ఆంధ్రగా మార్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.

Updated : 29 Dec 2021 14:35 IST

విజయవాడ: అన్నపూర్ణాంధ్రను అప్పుల ఆంధ్రగా మార్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్య నిషేధమని చెప్పి.. ఇప్పుడేమో ధరలు విపరీతంగా పెంచి అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడి బలహీనతపై డబ్బు సంపాదించడం దారుణమని మండిపడ్డారు. మద్యాన్ని ఏరులై పారిస్తూ పేదల రక్తం తాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. వైకాపా పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. మంత్రులు పరిపాలన మీద కాకుండా ప్రతిపక్ష పార్టీలను దూషించడంపై దృష్టి పెట్టారని మండిపడ్డారు.

‘‘మా పార్టీని ఎవరో ఇద్దరికి లీజ్‌ ఇచ్చామని మాట్లాడారు. భాజపాను ఎవరికీ లీజ్‌ ఇవ్వలేదు. తెదేపా, వైకాపా నేతలు ఎవరు ఎవరికి లీజుకిచ్చారో నాకు తెలుసు. తెదేపా నుంచి వైకాపాకు వచ్చిన వారికి ఏం లీజుకిచ్చారో చెప్పమంటారా?మీ లీజుల గురించి మేం మాట్లాడితే చొక్కాలు ఊడిపోతాయి. మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడమని పేర్నినానికి వినమ్రంగా చెబుతున్నాను. ఏపీలో రాజకీయ శూన్యత ఉంది.. భాజపా ఇకపై దూకుడుగా వెళ్లబోతోంది. రాష్ట్రంలో ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టులపై భాజపా పోరుబాట పట్టబోతోంది. ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలపై భాజపా దృష్టి సారిస్తోంది’’ అని సోము వీర్రాజు అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని