
TS News: సంక్షేమ పథకాలు అమలైతే డబ్బులెందుకు పంచారు?: డీకే అరుణ
హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో వీవీ ప్యాట్లు అక్రమంగా తరలించారనే వార్తల నేపథ్యంలో భాజపా నేతలు డీకే అరుణ, రాజాసింగ్, ఎన్. రామచందర్‌రావు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌంటింగ్ సమయంలో మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని నేతలు కోరారు.
ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన తర్వాత డీకే అరుణ మీడియాతో మాట్లాడారు.‘‘అధికార పార్టీ నాయకులు ఓటుకు ఆరేడు వేల రూపాయల చొప్పున పంచారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలైతే డబ్బులు ఎందుకు పంచారు?ఒక ఉప ఎన్నికకు రూ. వేల కోట్లు ఖర్చు చేశారు. ఓటమి భయంతోనే ఈవీఎంలు, వీవీ ప్యాట్లు మారుద్దామనే ఆలోచన చేశారు. కేవలం డబ్బు ఉన్నవాళ్లే రాజకీయం చేసే పరిస్థితులు తెచ్చారు’’ అని ఆమె అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.