TS News: దళితబంధు మొదలెట్టిన చోటా భాజపాదే ఆధిక్యం: డీకే అరుణ

దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన గ్రామంలోనూ భాజపా ఆధిక్యం కనబరిచిందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.

Updated : 24 Sep 2022 15:11 IST

హైదరాబాద్: దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన గ్రామంలోనూ భాజపా ఆధిక్యం కనబరిచిందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ ఫలితాలతో తెరాస పతనం ప్రారంభమైందన్నారు. ఆత్మగౌరవం, అహంకారానికి మధ్య జరిగిన పోరాటంలో ఆత్మగౌరవం గెలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు.

ఈ ఉప ఎన్నికలో అధికార పార్టీ పెద్దఎత్తున ఖర్చు పెట్టినా ప్రజలు ఆత్మగౌరవానికి పెద్దపీట వేశారని ఆమె చెప్పారు. నియంత పాలనకు చరమగీతం పాడాలని హుజూరాబాద్‌ ప్రజలు గుర్తు చేశారన్నారు. ఈటల భారీ మెజార్టీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌, ఈటల మధ్యే ఎన్నికలు జరిగాయని ప్రజలు భావించినట్లు డీకే అరుణ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని