TS News: ఉత్కంఠభరిత ఎన్నికలో ఇంత నిర్లక్ష్యమా?: ఈటల

హుజూరాబాద్ ప్రజలెవరూ ఆందోళనకు గురికావొద్దని మాజీ మంత్రి, ఉప ఎన్నిక భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు.

Updated : 31 Oct 2021 13:31 IST

హుజూరాబాద్‌: హుజూరాబాద్ ప్రజలెవరూ ఆందోళనకు గురికావొద్దని మాజీ మంత్రి, ఉప ఎన్నిక భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. అంతిమంగా ధర్మం, న్యాయానిదే గెలుపు అని చెప్పారు. బస్సుల్లో ఈవీఎం కూడా మార్చినట్లు వార్తలు వస్తున్నాయన్నారు. హుజూరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారుల తీరు పలు అనుమానాలకు తెరలేపిందని ఈటల ఆరోపించారు. ఓట్లు వేసిన బాక్సులను మాయం చేయడం దుర్మార్గమన్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. పొరపాటు జరిగిందని కలెక్టర్‌ చెబుతున్నారన్నారు. ఉత్కంఠభరితంగా జరిగిన ఎన్నికలో ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు.

సీపీ, కలెక్టర్‌కు చెప్పినా ప్రయోజనం లేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా తెరాస వ్యవహరించిందని ఈటల మండిపడ్డారు. డబ్బులు పెట్టి గెలిచే పద్ధతి మంచిది కాదని హితవు పలికారు. ఎమ్మెల్యేలే స్వయంగా డబ్బులు పంచి వెళ్లారన్నారు. తనను ఓడించేందుకు కేసీఆర్‌ అన్ని ప్రయత్నాలు చేశారని చెప్పారు. పోలింగ్‌ సిబ్బందికీ డబ్బులు ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. హుజూరాబాద్‌ ప్రజల తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని ఈటల అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు