AP News: గుంటూరులో జిన్నా టవర్‌ సెంటర్‌ పేరు మార్చాలి: భాజపా

గుంటూరు నగరంలోని జిన్నా టవర్‌ సెంటర్‌ పేరు మార్చాలంటూ పలువురు భాజపా నేతలు డిమాండ్ చేశారు. దేశద్రోహుల

Updated : 30 Dec 2021 16:05 IST

గుంటూరు‌: గుంటూరు నగరంలోని జిన్నా టవర్‌ సెంటర్‌ పేరు మార్చాలని పలువురు భాజపా నేతలు డిమాండ్ చేశారు. దేశద్రోహుల పేర్లు ఎక్కడున్నా తొలగించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. దేశ విభజనకు కారణమైన జిన్నా పేరిట టవర్‌తో పాటు ఆ ప్రాంతానికి జిన్నా పేరు ఎలా కొనసాగిస్తారని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

మరోవైపు హైదరాబాద్‌లోని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ విభజన, అనేక మంది మృతికి కారణమైన జిన్నా పేరును ఇంకా ఎందుకు ఉంచారని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం తక్షణమే ఆ పేరు తీసేయాలని రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. తక్షణం జిన్నా పేరు తీసేసి స్వాతంత్య్ర సమరయోధులు, అబ్దుల్‌కలాం లేదా గుర్రం జాషువా పేరు పెట్టాలన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని