AP News: తనిఖీల పేరిట వ్యవస్థలు కుంగిపోయేలా చేస్తున్నారు: జీవీఎల్‌

అధికారంతో వ్యవస్థలను భయపెట్టి తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు వైకాపా యత్నిస్తోందని భాజపా ఎంపీ

Updated : 25 Dec 2021 14:19 IST

రాజమహేంద్రవరం: అధికారంతో వ్యవస్థలను భయపెట్టి తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు అధికార పార్టీ వైకాపా యత్నిస్తోందని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. ఇప్పటికే పరిశ్రమలను బెదిరించి వెళ్లగొట్టారని.. గుత్తేదారులకు బిల్లులు చెల్లించకుండా భయపెట్టారని ఆరోపించారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం సినిమా థియేటర్లపై పడ్డారని జీవీఎల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భయపెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అవినీతి పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. తనిఖీల పేరిట వ్యవస్థలను కుంగిపోయేలా చేస్తున్నారని జీవీఎల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని