AP News: పెండింగ్‌ ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చేందుకు కృషి చేస్తా: జీవీఎల్‌

రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రైల్వే, రహదారులు, పర్యావరణ అనుమతుల కోసం కృషి చేస్తున్నట్లు భాజపా  రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు

Updated : 09 Oct 2021 18:52 IST

గుంటూరు: రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రైల్వే, రహదారులు, పర్యావరణ అనుమతుల కోసం కృషి చేస్తున్నట్లు భాజపా  రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. జిల్లాకు సంబంధించిన వివిధ అంశాలపై గుంటూరు కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌తో జీవీఎల్‌ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పల్నాడులో కృషి విజ్ఞాన కేంద్రం, రొంపిచర్లలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. జిల్లాలో వరికపూడిశల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. పల్నాడులో బుగ్గవాగు ప్రాజెక్టును సాగు, తాగు నీటి అవసరాలు తీర్చేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. విభజన తర్వాత ఏపీకి రావాల్సిన జాతీయ సంస్థలను తీసుకొస్తున్నామని చెప్పారు. మిగతా పార్టీలు రాజకీయాల గురించి మాట్లాడుతాయని.. భాజపా దృష్టంతా దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమంపైనే ఉంటుందని జీవీఎల్ నరసింహరావు వెల్లడించారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని