Ap News: రాష్ట్రాన్ని దివాలా దిశగా తీసుకెళ్తున్నారు: జీవీఎల్‌

వైకాపా ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ.1.45లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దిశగా తీసుకెళ్తోందని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. విజయవాడలో

Published : 05 Dec 2021 02:03 IST

విజయవాడ: వైకాపా ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ.1.45లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దిశగా తీసుకెళ్తోందని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. విజయవాడలో జరిగిన భాజపా కోర్‌ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను ఎంపీలు సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్‌తో కలిసి మీడియాకు వెల్లడించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.86వేల కోట్లు అప్పు చేస్తే .. రెండున్నరేళ్లలో అంతకు రెంట్టింపు అప్పులు చేశారని మండిపడ్డారు. చేసిన అప్పులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా, ఓటు బ్యాంకు, రాజకీయ అవసరాలకోసం మాత్రమే ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరిగిందని జీవీఎల్‌ వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు స్టిక్కర్లు వేసుకుని రాష్ట్ర ప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకుంటోందన్నారు. రాష్ట్ర రాజకీయం, ఆర్థిక పరిస్థితులపై కోర్‌కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని