AP News: వాళ్లిద్దరూ ప్రధాని అయినా ‘హోదా’ ఇవ్వడం జరగదు: సుజనా చౌదరి

ప్రత్యేకహోదా ముగిసిపోయిన అంశమని.. దానికి ప్రతిగా..

Updated : 28 Dec 2021 15:48 IST

విజయవాడ: ప్రత్యేకహోదా ముగిసిపోయిన అంశమని.. దానికి ప్రతిగా కేంద్రం ఇచ్చే రాయితీలను అందుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని భాజపా ఎంపీ సుజనాచౌదరి అన్నారు. వ్యవస్థ మారిందని.. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్‌, చంద్రబాబు ప్రధానమంత్రి అయినా ప్రత్యేకహోదా ఇవ్వడం జరగదన్నారు. విజయవాడలో సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలో అరాచక పాలన, పోలీస్‌ వ్యవస్థ తీరును కేంద్రం గమనిస్తోందని.. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. పోలీసులు వైకాపా కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని సుజనాచౌదరి ఆక్షేపించారు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని.. దాన్ని ఒక్క అంగుళం కూడా ఎవరూ కదిలించలేరని వ్యాఖ్యానించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని