TS News: మిషన్‌-19తో ముందుకెళ్లాలి: బండి సంజయ్‌

తెరాస ప్రభుత్వం దళితులకు అనేక హామీలిచ్చి విస్మరించిందని భాజపా రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. ఎస్సీ నియోజకవర్గాల్లో భాజపా సర్వే చేస్తే తెరాసపై తీవ్ర

Updated : 28 Dec 2021 16:28 IST

హైదరాబాద్‌: తెరాస ప్రభుత్వం దళితులకు అనేక హామీలిచ్చి విస్మరించిందని భాజపా రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. ఎస్సీ నియోజకవర్గాల్లో భాజపా సర్వే చేస్తే తెరాసపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ఎస్సీ నియోజకవర్గాలపై దృష్టి సారించిన భాజపా .. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో బండి సంజయ్‌ అధ్యక్షతన 19 అసెంబ్లీ, 3 పార్లమెంట్ ఎస్సీ రిజర్వు నియోజకవర్గాలపై సంస్థాగత కార్యశాలను ఏర్పాటు చేసింది. ఈ కార్యశాలలో అభ్యర్థుల గుర్తింపు, ఎస్సీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై చర్చతో పాటు దళితబంధు అమలు, దళితులకు కేసీఆర్‌ ఇచ్చిన హామీల అమలుకోసం పోరాట ప్రణాళిక రూపకల్పన చేయనున్నారు. ఈసందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ ఆలోచనా విధానంతో భాజపా ముందుకు వెళ్తుందని తెలిపారు. కాంగ్రెస్‌ దళితులను ఓటు బ్యాంకుగా చూసిందని ఆరోపించారు. మిషన్‌-19తో ముందుకు వెళ్లి విజయం సాధించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు విజయరామారావు, ఎ.చంద్రశేఖర్‌, బాబుమోహన్‌, మాజీ ఎంపీ వివేక్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని