TS Politics: తెలంగాణ అభివృద్ధిని కేసీఆరే అడ్డుకుంటున్నారు: విజయశాంతి

కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రజలకు చేరనివ్వకుండా తెరాస ప్రభుత్వం అడ్డుకుంటోందని భాజపా సీనియర్‌ నేత విజయశాంతి విమర్శించారు...

Updated : 12 Oct 2022 14:28 IST

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రజలకు చేరనివ్వకుండా తెరాస ప్రభుత్వం అడ్డుకుంటోందని భాజపా సీనియర్‌ నేత విజయశాంతి విమర్శించారు. తద్వారా తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆరే అడ్డుపడ్డుతున్నారని ఆరోపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టబోయే పాదయాత్రకు సంబంధించిన పాటల సీడీని ఆమె హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. ఏడేళ్ల పాలనలో తెరాస పాలన అవినీతిని పాటల ద్వారా ఎండగట్టామని తెలిపారు. భాజపాతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ భాజపానే అని విజయశాంతి స్పష్టం చేశారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని