
TS News: కేసీఆర్‌పై ప్రజల్లో విశ్వాసం లేదు: బండి సంజయ్
హైదరాబాద్: తెలంగాణలో సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో విశ్వాసం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్‌లో కాషాయ జెండా ఎగరబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ ఘన విజయం సాధించి.. అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమన్నారు.
దళిత బంధు అమలు చేసినా ప్రజలు తెరాసను నమ్మడం లేదని సంజయ్ ఎద్దేవా చేశారు. ఈటల భాజపా నాయకుడని.. ఆయన గెలుపు భాజపా గెలుపు.. భాజపా గెలుపు ఈటల గెలుపే అని వ్యాఖ్యానించారు. మరో వైపు హుజూరాబాద్‌లో భాజపా ఆధిక్యంలో కొనసాగుతుండంతో ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పార్టీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.