సుప్రీంకోర్టుకు సువేందు అధికారి

పశ్చిమబెంగాల్‌ భాజపా నేత, నందిగ్రామ్‌ ఎమ్మెల్యే సువేందు అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన ఎన్నికను సవాల్‌ చేస్తూ మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌ను వేరే హైకోర్టుకు బదిలీ చేయాలని కోరారు.

Updated : 15 Jul 2021 04:35 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ భాజపా నేత, నందిగ్రామ్‌ ఎమ్మెల్యే సువేందు అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన ఎన్నికను సవాల్‌ చేస్తూ తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌ను వేరే హైకోర్టుకు బదిలీ చేయాలని కోరారు. కలకత్తా హైకోర్టు మినహా ఏ హైకోర్టుకైనా బదిలీ చేయాలని అభ్యర్థించారు. అంతకుముందు సువేందు ఎన్నికపై మమత దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం కలకత్తా హైకోర్టులో విచారణ జరిగింది. నందిగ్రామ్‌ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు, పేపర్లను భద్రపరచాలని ఎన్నికల సంఘానికి సూచించింది. సువేందు అధికారికి సైతం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 12కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని