By election result: బద్వేలులో మూడో రౌండ్‌ ఫలితాలు వెల్లడి.. ఆధిక్యంలో ఎవరంటే!

కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్‌లో ఇప్పటి వరకు మూడు రౌండ్ల ఫలితాలు..

Updated : 02 Nov 2021 10:16 IST

బద్వేలు: కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్‌లో ఇప్పటి వరకు మూడు రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. తొలి రెండు రౌండ్లలో ఆధిపత్యం ప్రదర్శించిన వైకాపా మూడో రౌండ్‌లోనూ ఆధిక్యం ప్రదర్శించింది. వైకాపా తరఫున బరిలో నిలిచిన దాసరి సుధ మూడో రౌండ్‌ ముగిసే వరకు 24,979 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఈ రౌండ్‌లో వైకాపాకు 10,184 ఓట్లు, భాజపాకు 2,305, కాంగ్రెస్‌కు 598, నోటాకు 393 ఓట్లు పోలయ్యాయి. మరోవైపు తెలంగాణలోని హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలు కూడా వెలువడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని