Amarinder-Shah Meet: సాగు చట్టాలను రద్దు చేయండి.. అమిత్‌ షాకు అమరీందర్‌ విజ్ఞప్తి

పంజాబ్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం కొనసాగుతున్న వేళ..  మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు.

Published : 29 Sep 2021 21:24 IST

దిల్లీ: పంజాబ్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం కొనసాగుతున్న వేళ.. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. అయితే, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రైతుల ఆందోళనపై కేంద్ర హోంమంత్రితో తాను చర్చించినట్లు కెప్టెన్‌ అమరీందర్‌ వెల్లడించారు. సాగు చట్టాలను రద్దు చేయడం, కనీస మద్దతు ధరపై హామీ ఇవ్వడంతో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని వెంటనే పరిష్కరించాలని అమిత్‌ షాను విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.

అయితే, పంజాబ్‌ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ భాజపాలో చేరతారనే వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగానే కేంద్ర హోంమంత్రితో భేటీ అయినట్లు అందరూ భావించారు. బుధవారం సాయంత్రం అమిత్‌ షాతో దాదాపు గంటకుపైగా చర్చలు జరిపారు. అయినప్పటికీ భాజపాలో చేరికపై మాత్రం అమరీందర్‌ సింగ్‌ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని