Huzurabad by-election: ఈటల రాజేందర్‌పై కేసు నమోదు

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతున్న వేళ భాజపా అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై కేసు నమోదైందిహుజూరాబాద్‌ ఉప ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతున్న వేళ భాజపా అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై కేసు నమోదైంది

Updated : 30 Sep 2022 15:32 IST

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. నేతల మాటల తూటాలతో రాజకీయ వేడి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భాజపా అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై హుజూరాబాద్‌లో కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి సభ పెట్టారంటూ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

రోడ్డుపై బైఠాయించిన ఈటల, వివేక్‌

మరోవైపు, హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పల్‌ వద్ద ఆటో, కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. దీంతో రోడ్డుపై మృతుడి బంధువులు ధర్నాకు దిగారు. హజూరాబాద్‌- పరకాల రోడ్డుపై మూడు గంటలుగా ఆందోళన చేయడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఘటనా స్థలంలో  మృతుడి కుటుంబాన్ని భాజపా నేతలు ఈటల రాజేందర్‌, వివేక్‌ పరామర్శించారు. వారికి సంఘీభావంగా రోడ్డుపైనే బైఠాయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని