Updated : 01/12/2021 16:36 IST

Lok Sabha: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ప్రకటన

దిల్లీ: తెలుగు రాష్ట్రాల నుంచి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ఆహార, ప్రజాసరఫరాల మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ప్రకటన చేసింది. తెదేపా ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. గత మూడేళ్లలో సేకరించిన ధాన్యం వివరాలను కేంద్రం వెల్లడించింది. 2018-19లో ఏపీ నుంచి 48.06 లక్షల మెట్రిక్‌ టన్నులు, తెలంగాణ నుంచి 51.90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లు పేర్కొంది. అలాగే 2019-20లో ఏపీ నుంచి 55.33 లక్షల మెట్రిక్‌ టన్నులు, తెలంగాణ నుంచి 74.54 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపింది. 2020-21లో ఏపీ నుంచి 56.67 లక్షల మెట్రిక్‌ టన్నులు, తెలంగాణ నుంచి 94.53 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు వెల్లడించింది. ఎఫ్‌సీఐ ఆస్తులను అమ్మకానికి పెట్టడం లేదని కేంద్రం స్పష్టం చేసింది.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని