Ap News: చంద్రబాబుకు అమిత్‌ షా ఫోన్‌.. రాష్ట్ర పరిణామాలపై చర్చ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఫోన్‌లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా కార్యాలయాలపై జరిగిన దాడి వివరాలు, ఇతరత్రా అంశాలపై

Updated : 28 Oct 2021 09:41 IST

దిల్లీ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఫోన్‌లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా కార్యాలయాలపై జరిగిన దాడి వివరాలు, ఇతరత్రా అంశాలపై చర్చించేందుకు చంద్రబాబు ఇటీవల దిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. దిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు.. అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ కోరారు. అదే సమయంలో కశ్మీర్‌ పర్యటన, వరుస కార్యక్రమాల కారణంగా అమిత్‌ షా సమయం ఇవ్వలేకపోయారు. కశ్మీర్‌ పర్యటన నుంచి తిరిగొచ్చిన అమిత్‌ షా ఇవాళ చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై అమిత్‌ షాతో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తోందని ఈ సందర్భంగా రాష్ట్ర పరిణామాలను చంద్రబాబు అమిత్‌షాకు వివరించినట్లు సమాచారం. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా తెదేపా నేతలు పోరాడుతుంటే వైకాపా దాడులకు తెగపడటంతో పాటు పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ బాధితులపైనే అక్రమ కేసులు బనాయిస్తోందని ఫిర్యాదు చేసినట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని