Kishan Reddy: లక్ష్య సాధనకు మందకృష్ణ మాదిగ నిరంతర కృషి: కిషన్‌రెడ్డి

ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ పోరాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Updated : 24 Sep 2022 16:59 IST

హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ పోరాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఇటీవల స్నానాలగదిలో జారి పడి.. చికిత్స తీసుకొని కోలుకుంటున్న మందకృష్ణను పరామర్శించిన ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయం కోసం మందకృష్ణ అనేక ఉద్యమాలు చేశారని కిషన్‌రెడ్డి చెప్పారు. త్వరగా కోలుకొని లక్ష్య సాధనలో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న సమయంలో కిషన్‌రెడ్డి సోదరుడిగా గొప్ప పాత్ర పోషించి తన బాధ్యత తీసుకున్నారన్నారు.

అనేక కారణాలతో ఎస్సీ వర్గీకరణ పెండింగ్‌లో ఉన్నప్పటికీ తమ మధ్య మంచి సంబంధమే ఉందని చెప్పారు. నాలుగేళ్ల క్రితం శాసనసభలో మాట్లాడుతూ రెండు రోజుల్లో ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తా అని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఆ పని చేయాలని మందకృష్ణ కోరారు. రెండేళ్ల లోపు ‘దళిత బంధు’ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వంద శాతం మందికి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని