
TS News: భాజపాలో చేరిన తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు విఠల్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు సీహెచ్. విఠల్ భాజపాలో చేరారు. దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్‌నఖ్వీ, తెలంగాణ భాజపా వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకొన్నారు.
ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ అసలైన ఉద్యమకారులకు తమ పార్టీ వేదికగా మారుతోందన్నారు. నిజమైన ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ ఆశయాన్ని పక్కనపెట్టి కుటుంబం, సొంతవారి ఆస్తులు పెంచడానికి కేసీఆర్ కృషి చేస్తున్నారని తరుణ్‌చుగ్ విమర్శించారు. విఠల్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చినా నిరుద్యోగుల ఆత్మబలిదానాలు ఆగడం లేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.