Ts News: వ్యవసాయ చట్టాల అమలుకు ఉవ్విళ్లూరుతున్న సీఎం కేసీఆర్‌: చాడ వెంకట్‌రెడ్డి

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను అమలు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు...

Published : 11 Oct 2021 02:04 IST

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను అమలు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. రైతులు తమ పొలాల్లో ఏం పండించాలో కూడా ప్రభుత్వమే నిర్ణయించడమేంటని మండిపడ్డారు. విత్తనాల విక్రయాలను నిషేధించడంపై హిమాయత్‌నగర్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఏ పంటను పండించాలి అనే స్వేచ్ఛను రైతులకు ఇవ్వాలన్నారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని చాడ డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాలు కృష్ణా జలాలపై పరస్పర ఫిర్యాదులతో ఇతరులకు అవకాశం ఇస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడు భూముల హక్కు పత్రాల కోసం శాసనసభ్యుల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చాడ తప్పుబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని