Ap News: ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు ఉపసంహరించినట్లు ప్రకటన: చంద్రబాబు

కుప్పం మున్సిపాలిటీ, దర్శి నగర పంచాయతీలో అభ్యర్థుల తుది జాబితా ప్రకటించకపోవటంపై రాష్ట్ర ఎన్నికల సంఘాని(ఎస్‌ఈసీ)కి తెదేపా అధినేత చంద్రబాబు ఫిర్యాదు

Updated : 09 Nov 2021 02:55 IST

అమరావతి: కుప్పం మున్సిపాలిటీ, దర్శి నగర పంచాయతీలో అభ్యర్థుల తుది జాబితా ప్రకటించకపోవటంపై రాష్ట్ర ఎన్నికల సంఘాని(ఎస్‌ఈసీ)కి తెదేపా అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ సంతకాలతో కుప్పం మున్సిపాలిటీలోని 13, 14, 15 వార్డుల తెదేపా అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించినట్లు ప్రకటించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తెదేపా అభ్యర్థులను పోటీలో లేకుండా చేసేందుకు తప్పుడు మార్గాలు అనుసరిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే 13, 14, 15 వార్డుల్లో ఎన్నికల ప్రక్రియను నిలుపుదలచేసి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సహకరించాలని కోరారు. అధికార పార్టీ నేతల ప్రోద్బలంతోనే తప్పుడు సంతకాలతో నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు ప్రకటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే వరకు ఎన్నికల ప్రక్రియను నిలుపదల చేయాలని లేఖలో కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని