Chandrababu: చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష ప్రారంభం

తెదేపా అధినేత చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష ప్రారంభమైంది. తెదేపా కేంద్ర కార్యాలయంపై దుండగుల

Updated : 21 Oct 2021 10:16 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష ప్రారంభమైంది. తెదేపా కేంద్ర కార్యాలయంపై దుండగుల దాడి, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలపై వైకాపా నేతలు, కార్యకర్తల దాడి యత్నాలకు నిరసనగా ఆయన దీక్ష చేపట్టారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పగిలిన అద్దాలు, ధ్వంసమైన సామగ్రి మధ్యలోనే చంద్రబాబు దీక్షకు కూర్చొన్నారు. ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన దీక్ష.. రేపు రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది.

చంద్రబాబు దీక్ష నేపథ్యలో పార్టీ కేంద్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా వివిధ జిల్లాల నుంచి ముఖ్యనేతలంతా అక్కడికి చేరుకున్నారు. దీక్షకు వెళ్లకుండా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పెదవేగి, గోపాలపురం మండలాల్లో తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. మరోవైపు మంగళవారం నాడు అరెస్టు చేసిన తెదేపా నేత బ్రహ్మం చౌదరిని ఈ తెల్లవారుజామున మంగళగిరి గ్రామీణ పీఎస్‌కు తరలించారు. ఆ సమయంలో అదుపులోకి తీసుకున్న మిగతా వారిని నిన్న సాయంత్రం వదిలిపెట్టారు. ఏ కేసులో బ్రహ్మంను అరెస్టు చేశారో పోలీసులు వివరాలు వెల్లడించలేదు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని