Charanjit Singh Channi: నాకెలాంటి అహం లేదు.. ఇప్పటికే సిద్ధూతో మాట్లాడా..!

రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభంపై పార్టీ నేతలంతా కూర్చొని, మాట్లాడుకోవాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీ అన్నారు. తాను ఇప్పటికే నవజోత్‌ సింగ్ సిద్ధూతో మాట్లాడానని వెల్లడించారు.

Published : 30 Sep 2021 01:17 IST

చండీగఢ్‌: రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభంపై పార్టీ నేతలంతా కూర్చొని మాట్లాడుకోవాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీ అన్నారు. తాను ఇప్పటికే నవజోత్‌ సింగ్ సిద్ధూతో మాట్లాడానని వెల్లడించారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి నిన్న సిద్ధూ రాజీనామా చేయడం పార్టీ వర్గాలను ఆశ్చర్యపర్చింది. దాంతో పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని తొలగించేందుకు చన్నీ పూనుకున్నారు. ఈ క్రమంలోనే బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు.

‘రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై మాట్లాడటానికి నాకు ఎలాంటి అహం లేదు. నేతలందరితో కూర్చొని మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజల కోసం కలిసి పనిచేయగలం. అన్నింటికి మించి పార్టీ అత్యున్నతమైందని నేను సిద్ధూకి స్పష్టం చేశాను. విభేదాలను తొలగించుకునేందుకు మాట్లాడుకుందాం అని చెప్పాను’ అని చన్నీ వెల్లడించారు.

పార్టీ పదవికి రాజీనామా చేసిన సిద్ధూ.. ఈ రోజు ట్విటర్ వేదికగా వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తన తుదిశ్వాస వరకు నిజం కోసమే పోరాడతానని, అవినీతి మరకలు అంటిన నేతల్ని అనుమతించబోమని ఆ వీడియోలో వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని