TS News: చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ అరెస్ట్‌

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత బొడిగె శోభను పోలీసులు అరెస్ట్ చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈనెల 3న చేపట్టిన జన జాగరణ

Updated : 05 Jan 2022 14:49 IST

చొప్పదండి: కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత బొడిగె శోభను పోలీసులు అరెస్ట్ చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈనెల 3న చేపట్టిన జన జాగరణ దీక్ష సమయంలో నమోదైన కేసులో భాగంగా ఆమెను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. జనజాగరణ దీక్ష చేపట్టేటపుడు కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన, పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై 16 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా ఇప్పటికే బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. తాజాగా బొడిగె శోభను కూడా అరెస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని