
Published : 15 Nov 2021 13:28 IST
AP News: విశాఖలో వైకాపా, జనసేన కార్యకర్తల మధ్య గొడవ
విశాఖ : విశాఖ 31వ డివిజన్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ప్రేమ సమాజం స్కూల్ ఎన్నికల బూత్ వద్ద వైకాపా, జనసేన కార్యకర్తలు మధ్య గొడవ జరిగింది. పెద్ద సంఖ్యలో అక్కడికి ఇరు పార్టీల కార్యకర్తలు చేరుకున్నారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా వీరు బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇరు వర్గాలకు నచ్చజెప్పారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో చెదురుమదురు ఘటనల మధ్య పోలింగ్ కొనసాగుతోంది. వైకాపా నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ స్థానిక పూలమార్కెట్ వద్ద నిరసనకు దిగిన తెదేపా కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.
Tags :