
TS News: కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వమే ధర్నా చేయడమేంటి?: భట్టి
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయాల్సిందే అని తెలంగాణ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ధాన్యం కొనుగోళ్లు, రైతుల సమస్యలపై ఆ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. నగరంలోని పబ్లిక్ గార్డెన్స్ నుంచి వ్యవసాయ కమిషనరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహా, సీతక్క తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో గత ప్రభుత్వాల హయాంలో రాని సమస్య ఇప్పుడెందుకు వచ్చిందని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వమే ధర్నా చేయడం ఏంటని ఆయన నిలదీశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆడుకుంటున్నాయని భట్టి విక్రమార్క ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసి.. కార్పొరేట్లకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆయన ఆక్షేపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానిపై ఒకటి నెపం వేసుకొని అన్నదాతలకు అన్యాయం చేస్తున్నారని ఉత్తమ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ది దొంగ దీక్ష చేస్తున్నారని సీతక్క విమర్శించారు. రైతులు నష్టపోతారనుకున్నప్పుడు పరిష్కారం చూపకుండా దీక్షలకు దిగడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రభుత్వమే వడ్లు కొనాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ధర్నా నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
-
Politics News
YSRCP: గన్నవరం వైకాపాలో 3 ముక్కలాట.. అభ్యర్థి ఎవరో తేల్చేసిన కొడాలి నాని
-
Politics News
Eknath Shindhe: నాడు ఆటో నడిపారు.. ఇకపై మహారాష్ట్రను నడిపిస్తారు..
-
World News
Pak Economic Crisis: దాయాది దేశం.. మరో శ్రీలంక కానుందా..?
-
Business News
Vedantu: ఇక ఆఫ్లైన్లోనూ పాఠాలు.. తొలి కేంద్రాన్ని ప్రారంభించిన ‘వేదాంతు’
-
Politics News
Eknath Shinde: మహారాష్ట్ర సీఎంగా శిందే, డిప్యూటీ సీఎంగా ఫడణవీస్ ప్రమాణ స్వీకారం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- PM Modi Tour: తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- IND vs ENG: కథ మారింది..!
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ శిందే.. నేడే ప్రమాణం
- Rocketry Preview: ప్రివ్యూ: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Raj Thackeray: అన్న రాజీనామా.. రాజ్ ఠాక్రే కీలక ట్వీట్
- Major: ఓటీటీలోకి ‘మేజర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్‌కు లేని ఇబ్బంది నాకెందుకు?