TS Congress : ఎక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై

Published : 24 Sep 2021 12:00 IST

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్‌ పార్టీ చర్చించింది. ఈ మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ భేటీకి ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి, ఎమ్మెల్యేలు జ‌గ్గారెడ్డి, శ్రీధ‌ర్‌బాబు, సీత‌క్కలు హాజరయ్యారు.

రాష్ట్రంలో ప్రధాన ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో గట్టిగా పోరాడాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రజా సమస్యలపై చ‌ర్చించాల్సి ఉన్నందున ఎక్కువ రోజులు అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌పాల‌ని బీఏసీలో డిమాండ్ చేస్తామని నేతలు అన్నారు. అలాగే సభలో కాంగ్రెస్ పార్టీకి త‌గినంత స‌మ‌యం ఇవ్వాల‌ని బీఏసీలో కోరతామని తెలిపారు. ద‌ళిత బంధు, ఆర్టీసీ, విద్యుత్తు ఛార్జీల పెంపు ప్రతిపాదన, పోడుభూములు, ధ‌ర‌ణి పోర్టల్‌ స‌మ‌స్యలు త‌దిత‌ర అంశాలపై చర్చకు పట్టుబట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని