chandrababu: వైఎస్‌ వర్ధంతికి అడ్డురాని నిబంధనలు.. చవితికెలా వర్తిస్తాయి?: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్ లేని దిశ చట్టాన్ని ఉన్నట్లుగా ప్రజలను భ్రమింపజేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ డొల్లతనం బయటపడిందని..

Published : 06 Sep 2021 16:00 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్ లేని దిశ చట్టాన్ని ఉన్నట్లుగా ప్రజలను భ్రమింపజేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ డొల్లతనం బయటపడిందని.. దిశ చట్టం ఎక్కడ ఉందో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దిశ చట్టంపై పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమీక్షించారు. బాధిత మహిళలకు న్యాయం జరిగేందుకు ఈ నెల 9న గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు చెప్పారు. వినాయక చవితి పూజలకు ఆంక్షలు ఏవిధంగా పెడతారని ప్రశ్నించారు. ఇడుపులపాయతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతికి వర్తించని కొవిడ్‌ నిబంధనలు వినాయక చవితికి ఏవిధంగా వర్తిస్తాయని నిలదీశారు. తెలంగాణలో వినాయక పూజలకు అనుమతించగా ఏపీలో మాత్రం ఎందుకు నిరాకరించారన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ నెల 10వ తేదీన చవితి పూజా కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని