CM Jagan: కేంద్ర మంత్రి గడ్కరీతో జగన్ భేటీ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు దిల్లీ పర్యటన కొనసాగుతోంది.

Updated : 04 Jan 2022 13:45 IST

దిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ ఉదయం కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో జగన్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, జాతీయ రహదారుల విస్తరణపై చర్చించారు. తీర ప్రాంతం వెంబడి నాలుగు లైన్ల రహదారులు నిర్మాణం చేపట్టాలని కేంద్రమంత్రిని జగన్‌ కోరారు. వీటితో పాటు విశాఖ- భోగాపురం జాతీయ రహదారి నిర్మాణం, విజయవాడ తూర్పు హైవే ఏర్పాటుపై కేంద్రమంత్రితో చర్చించారు. పెండింగ్‌ ప్రాజెక్టులకు త్వరగా అనుమతి ఇవ్వాలని గడ్కరీకి సీఎం వినతిపత్రం అందజేశారు.

మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కూడా జగన్‌ ఇవాళ భేటీ కానున్నారు. తొలిరోజు పర్యటనలో భాగంగా సీఎం జగన్‌ నిన్న ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, జ్యోతిరాదిత్య సింధియాలను వేర్వేరుగా కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని