Updated : 09/11/2021 16:21 IST

CM Jagan: ఎమ్మెల్యే కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్‌

పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్‌ హాజరయ్యారు. విజయవాడ నుంచి విమానంలో విశాఖ చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పాతపట్నం చేరుకున్నారు. వివాహ రిసెప్షన్‌లో పాల్గొని నూతన వధూవరులు వేదిత, రుచిత్‌లను ఆశీర్వదించారు. జగన్‌ వెంటన స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలు ఉన్నారు. 

సాయంత్రం 5 గంటలకు ఒడిశా సీఎంతో భేటీ

పాతపట్నం పర్యటన ముగిసిన అనంతరం సీఎం జగన్‌ ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్‌తో సీఎం భేటీ కానున్నారు. వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టులకు భూసేకరణ, సహాయ, పునరావాస కార్యక్రమాల అమలుకు సహకరించాల్సిందిగా నవీన్‌ పట్నాయక్‌ను జగన్‌ కోరనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ జరగనుంది.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని