Badvel By Election: అతివిశ్వాసం వద్దు.. కష్టపడి ప్రజామోదం పొందాలి: జగన్‌

కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికపై వైకాపా నేతలు, మంత్రులతో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

Updated : 30 Sep 2021 15:50 IST

అమరావతి: కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికపై వైకాపా నేతలు, మంత్రులతో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. దివంగత ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్‌ సుధను పార్టీ అభ్యర్థిగా నిలబెడుతున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఉపఎన్నికకు వైకాపా తరఫున ఇన్‌ఛార్జ్‌గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమిస్తున్నట్లు చెప్పారు. అతివిశ్వాసం వద్దు.. కష్టపడి ప్రజల ఆమోదం పొందాలని దిశానిర్దేశం చేశారు. ఓట్లు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలని.. అన్ని సామాజిక వర్గాలకు కలుపుకొని వెళ్లాలని సూచించారు. గ్రామస్థాయి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించానన్నారు. వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు చేపట్టాలని జగన్‌ సూచించారు. 

బద్వేలులో ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్‌ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతిచెందడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. అక్టోబర్‌ 30 ఎన్నికల పోలింగ్‌ చేపట్టి నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని