CM KCR: పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను ఖరారు చేసిన కేసీఆర్‌

తెలంగాణలోని పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. తెలంగాణ ఉమెన్స్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా

Published : 17 Dec 2021 11:55 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. తెలంగాణ ఉమెన్స్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా గజ్జెల నగేశ్‌, స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ ఛైర్మన్‌గా పాటిమీది జగన్మోహన్‌రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా జూలూరి గౌరీశంకర్‌, షీప్‌ అండ్‌ గోట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్‌లను కేసీఆర్‌ నియమించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి.

ఇటీవలే మూడు కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఛైర్మన్‌గా, తెరాస సామాజిక విభాగం నేత మన్నె క్రిశాంక్‌ను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఎండీసీ) ఛైర్మన్‌గా, తెరాస ధూంధాం కళాకారుడు, గాయకుడు వేద సాయిచంద్‌(సాయిచందర్‌)ను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరికొన్ని కార్పొరేషన్ల ఛైర్మన్లను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts