Published : 18/11/2021 01:48 IST

TS News: ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వండి:  ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ

హైదరాబాద్‌: రబీ ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ .. ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అసంబద్ధ విధానాలు అవలంభిస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతూ ధాన్యం దిగుబడులు అధికంగా వస్తాయని తెలిసినా.. ఎఫ్‌సీఐ ధాన్యం సేకరణ లక్ష్యాలను తగ్గిస్తోందన్నారు. ఈ అంశాలపై కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి స్వయంగా వివరించినా స్పందన లేదన్న ముఖ్యమంత్రి.. ఎఫ్‌సీఐకి త్వరితగతిన ఆదేశాలివ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 

‘‘రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. వినూత్న విధానాలతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న వివిధ పథకాల వల్లే ఇది సాధ్యమైంది. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌, ఏడాదికి ఎకరానికి రూ.10వేల పెట్టుబడి సాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. కష్టజీవి అయిన తెలంగాణ రైతు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుంటూ గుణాత్మకంగా దిగుబడి సాధిస్తున్నారు. తద్వారా తెలంగాణ రైతులు దేశ ప్రగతికి దోహదం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎక్కడ చూసినా కరువు కాటకమే తాండవించేది. ఇప్పుడు రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన సాగునీటి లభ్యతతో తన అవసరాలను దాటి ఆహారధాన్యాల దిగుబడిలో మిగులు రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 2021-22 ఖరీఫ్‌లో 40లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి. వచ్చే రబీలో రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో తెలపాలి. ఎఫ్‌సీఐ తీరుతో రాష్ట్రాల్లో గందరగోళం నెలకొంది. 2020-21 రబీలో మిగిలిన 5లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేయాలి’’ అని సీఎం కేసీఆర్‌  కోరారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న వేళ సీఎం కేసీఆర్‌ ప్రధానికి లేఖ రాశారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని