Ts Assembly: తెలంగాణలో ‘హరిత నిధి’ ఏర్పాటుకు యోచన: సీఎం కేసీఆర్‌

తెలంగాణ హరిత నిధి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని.. అందుకు తెరాస ప్రజాప్రతినిధులు అంగీకరించారని సీఎం కేసీఆర్‌ తెలిపారు. హరితహారంపై చర్చలో

Updated : 01 Oct 2021 18:05 IST

హైదరాబాద్: తెలంగాణ హరిత నిధి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని.. అందుకు తెరాస ప్రజాప్రతినిధులు అంగీకరించారని సీఎం కేసీఆర్‌ తెలిపారు. హరితహారంపై చర్చలో భాగంగా సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో మాట్లాడారు. హరిత నిధిని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించాలని సీఎం సభ్యులను కోరారు. అంతేకాకుండా హరితనిధి ప్రతిపాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రతి నెల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హరితనిధికి రూ.500 జమ చేస్తారని కేసీఆర్‌ చెప్పారు. మిగతా పక్షాలు కూడా హరిత నిధికి ముందుకు రావాలని కోరారు. హరిత నిధి విషయంలో ప్రతిపాదనలు కూడా వచ్చాయని పేర్కొన్నారు.

‘‘హరిత నిధి కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వామ్యులను చేయాలనే ఆలోచన ఉంది. ప్రవేశాల సమయంలో హరిత నిధికి జమ చేయాలనే ప్రతిపాదన చేశారు. ప్రవేశాల సమయంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రూ.5, హైస్కూల్‌ విద్యార్థులు రూ.15, ఇంటర్‌ విద్యార్థులు రూ.25, డిగ్రీ విద్యార్థులు రూ.50, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులు రూ.100 జమ చేయాలి. అలాగే లైసెన్స్ రెన్యువల్ సమయంలో, వ్యాపారులు, బార్లు, మద్యం దుకాణదారులు హరిత నిధికి జమ చేయాలి. రెన్యువల్ సమయంలో రూ.1000 జమకు ప్రతిపాదనలు వచ్చాయి. రాష్ట్రంలో నిత్యం 8వేలకుపైగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. భూముల రిజిస్ట్రేషన్ల సమయంలో రూ.50 జమ చేయాలి’’ అనే యోచన ఉన్నట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు